ఆ తేదీన ఓటీటీలోకి పెద్ది

by Pulgam srinivas |

'పెద్ది' సినిమా జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఆ తేదీన ఓటీటీలోకి పెద్ది
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా జూలై 2 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కీలారు నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

Next Story