- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi : ఏప్రిల్ మొదటి వారంలో అక్కడ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న యూనిట్
Peddi : ఏప్రిల్ మొదటి వారంలో 'యూఎస్ఏ'లో ఓ గ్రాండ్ ఈవెంట్ను ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇప్పటికే ఈ మూవీ బృందం మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో పెద్ది ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యంధు లాంటి మంచి క్రేజ్ ఉన్న నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమాను ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ వెళుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ గ్లింప్స్ వీడియోను, పాటను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. రేపు ఈ సినిమా నుండి రెండవ పాటను విడుదల చేయనున్నారు. దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మన సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతిపెద్ద మార్కెట్ ఓవర్సీస్. అక్కడ మంచి ప్రమోషన్లు చేసినట్లయితే ఓపెనింగ్స్ కూడా గట్టిగా వస్తున్నాయి.
దానితో చాలామంది మేకర్స్ 'యూఎస్ఏ'లో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. పెద్ది యూనిట్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో 'యూఎస్ఏ'లో ఓ గ్రాండ్ ఈవెంట్ను ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఈ ఈవెంట్ సక్సెస్ అయితే 'పెద్ది'పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.






