- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ క్రేజీ సంస్థ చేతికి ‘పెద్ది’ తమిళనాడు.. కేరళ హక్కులు
'పెద్ది' తమిళనాడు,, కేరళ థియేటర్ హక్కులను థింక్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. దీంతో చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మే 18న విడుదల చేసిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒకవైపు ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్ర బృందం మరోవైపు థియేటర్ హక్కుల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచి గుర్తింపు, బలమైన పంపిణీ వ్యవస్థ ఉన్న సంస్థలకే థియేటర్ హక్కులను అప్పగిస్తున్నారని సమాచారం.
తాజాగా ‘పెద్ది’ తమిళనాడు, కేరళ థియేటర్ హక్కులను విక్రయించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ హక్కులను థింక్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఈ సంస్థకు మంచి పట్టు ఉండటంతో, సినిమాకు మంచి థియేటర్లు దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో సినిమాకు మంచి టాక్ వస్తే ఈ ప్రాంతాల్లో మంచి వసూళ్లు సాధించే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు.






