- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ది స్పెషల్ సాంగ్ పోస్ట్‌పోన్.. కారణం ఏంటో తెలుసా?
ప్రస్తుతానికి పెద్ది మూవీ బృందం ఐటమ్ సాంగ్ విషయాన్ని పక్కనపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు, ఆ పనులు పూర్తయ్యాక ఈ సాంగ్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పెద్ది సినిమాకు సంబంధించిన చివరి పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తేదీన ఈ సినిమా విడుదల కావడం కష్టం అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంతో రామ్ చరణ్ ‘రాకాస’ ఈవెంట్లో మాట్లాడుతూ, ఒక పాట షూటింగ్ మినహాయిస్తే మా చిత్రానికి సంబంధించిన మొత్తం పనులు పూర్తయ్యాయని, చెప్పిన విధంగా ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న ఆ ఒక్క పాట ఐటమ్ సాంగ్ అని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పటివరకు ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. అలాగే ఇందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై కూడా పెద్దగా క్లారిటీ లేదు. దాంతో ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. ప్రస్తుతం మూవీ బృందం ఐటమ్ సాంగ్ విషయాన్ని పక్కనపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు, ఆ పనులు పూర్తయ్యాక ఐటమ్ సాంగ్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో ఏ ముద్దుగుమ్మ నటిస్తుందో అనేది ప్రేక్షకుల్లో ఇంకా ఉత్కంఠగా మారింది.






