- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi: శాటిలైట్.. ఓటీటీ డీల్ క్లోజ్?
పెద్ది సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చెంజర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఆ తర్వాత రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబోలో తెరకెక్కిన పెద్ది ప్రస్తుతం భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.160 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదే సమయంలో ఈ మూవీ శాటిలైట్, ఓటీటీ హక్కులకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. థియేటర్ రన్ పూర్తైన కొన్ని వారాల తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుండగా, అనంతరం కొన్ని వీక్స్ కి జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్స్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ నిర్మించగా, సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించారు. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా జాన్వి కపూర్ నటించింది.






