‘పెద్ది’ నెక్స్ట్ స్టెప్ ఇదే... సోషల్ మీడియాలో వైరల్

by Sujitha Rachapalli |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

‘పెద్ది’ నెక్స్ట్ స్టెప్ ఇదే... సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం బిగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుండగా.. ఇందుకోసం చెర్రీ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు. తాజాగా విడుదలైన స్టిల్‌లో రామ్ చరణ్ బీస్ట్ మోడ్‌లోఅదిరిపోగా.. రాక్ సాలిడ్ మజిల్స్, ఇంటెన్స్‌ లుక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. మరో వైపు ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. AR రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్‌తో ఈ సాంగ్ గ్లోబల్ మూమెంట్‌గా మారింది. త్వరలోనే మరో పాటని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న సినిమాను.. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తుంది. మార్చి 27న ‘పెద్ది’ గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్ కాబోతుందని మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.

Next Story