- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని కోట్లకు అమ్ముడుపోయిన పెద్ది నెల్లూరు హక్కులు
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పెద్ది చిత్ర నెల్లూరు థియేట్రికల్ హక్కులను ప్రభాకర్ రెడ్డి రూ. 6.80 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పెద్ది సినిమాపై ప్రస్తుతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ బృందం ఒక్కో ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను విక్రయిస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా నెల్లూరు ఏరియా హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నెల్లూరు థియేట్రికల్ హక్కులను ప్రభాకర్ రెడ్డి రూ. 6.80 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను జూన్ 3వ తేదీన భారీ ఎత్తున ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది.






