- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విడుదలకి తేదీ... వేదిక ఖరారు
‘పెద్ది’ చిత్రంలోని ఐటమ్ సాంగ్‌ను మే 23న భోపాల్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలను జూన్ 3న భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా భోపాల్‌లో కూడా ఓ భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా, మరో ఐటమ్ సాంగ్ విడుదల కావాల్సి ఉంది.
ఈ పాటను మే 23న భోపాల్‌లో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ ఐటమ్ సాంగ్‌పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ పాట ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ పాటలో శృతిహాసన్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా చరణ్‌తో కలిసి స్టెప్పులు వేసినట్లు సమాచారం. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమైంది.






