- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రోర్ ఆఫ్ పెద్ది’..అదిరిపోయే వీడియో సాంగ్ రిలీజ్
రోల్ ఆఫ్ పెద్ది పేరుతో మస్సా మస్సా (Massa Massa) అంటూ సాగే వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా పెద్ది. ఉప్పెనతో ప్రభంజనం సృష్టించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజులు గ్యాప్ తీసుకొని మరీ, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ హీరోగా చేయగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందించగా.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు.
జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ ఈవెంట్ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ కూడా ఇచ్చారు. రోల్ ఆఫ్ పెద్ది పేరుతో మస్సా మస్సా (Massa Massa) అంటూ సాగే వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ కుస్తీ పోటీలకు సంబంధించిన విజువల్స్ అందరినీ కనువిందు చేస్తున్నాయి. ఇక అటు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన హల్లల్లల్లో , చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ రిలీజ్ అయిందని ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.






