- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది సినిమా ఎఫెక్ట్..పిఠాపురంలో బుచ్చిబాబు పూజలు !
పిఠాపురంలో నూతన గృహప్రవేశం చేశాడట దర్శకుడు బుచ్చిబాబు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ ఆ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. మరో నాలుగు నెలల్లోనే థియేటర్లో ఆడనుంది ఈ బొమ్మ. అంటే మార్చి 27వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చికిరి చికిరి అంటూ సాగే పాటను కూడా రిలీజ్ చేశారు.
ఇది సోషల్ మీడియాను చెక్ చేస్తోంది. అంతేకాదు గడిచిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన పాటగా రికార్డు సృష్టించింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. పిఠాపురంలో నూతన గృహప్రవేశం చేశాడట దర్శకుడు బుచ్చిబాబు. ఇందులో భాగంగానే కుటుంబ సమేతంగా పూజలో దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్న వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు... బుచ్చిబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా రిలీజ్ కాకముందే మనోడు, గృహప్రవేశం కూడా చేసేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే, భారీగానే డబ్బులు కూడా సంపాదిస్తాడని అంటున్నారు.






