నార్త్‌లో ‘పెద్ది’ భారీ ప్లాన్.. హిట్ టాక్ వస్తే రికార్డ్స్ ఖాయం

by Pulgam srinivas |

పెద్ది హిందీ హక్కులను జియో స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

నార్త్‌లో ‘పెద్ది’ భారీ ప్లాన్.. హిట్ టాక్ వస్తే రికార్డ్స్ ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” సినిమా విడుదల తేదీని ప్రకటించే ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం మూవీ టీమ్ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు బుచ్చిబాబు సనా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నిర్మాత వెంకట సతీష్ కిలారు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో భాగంగా చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. “చిక్రి చిక్రి” పాటలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఆయనలో ఇంత ఎనర్జీ ఎక్కడ దాచుకున్నాడా అనిపించిందని, తాను తెరకెక్కించిన రంగస్థలం సినిమాకంటే ఎక్కువ స్థాయిలో ఈ చిత్రంలో చరణ్ నటన ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు, ఈ మూవీ హిందీ హక్కులను జియో స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. జియో స్టూడియోస్ సంస్థకు నార్త్ ఏరియాలో గట్టి పట్టు ఉంది. దాంతో ఈ మూవీకి మంచి టాక్ వస్తే హిందీ ఏరియా నుండి అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Next Story