Peddi : నాగ వంశీ చేతికి ఈస్ట్ గోదావరి హక్కులు.. పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా

by Pulgam srinivas |

Peddi : పెద్ది సినిమా ఈస్ట్ గోదావరి హక్కులను 13.20 కోట్ల భారీ ధరకు నాగ వంశీ దక్కించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Peddi : నాగ వంశీ చేతికి ఈస్ట్ గోదావరి హక్కులు.. పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. దీనిని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను కూడా అమ్మి వేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈస్ట్ గోదావరి హక్కులకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

తెలుగు చిత్ర సీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపును సంపాదించుకున్న నాగ వంశీ 'పెద్ది' యొక్క ఈస్ట్ గోదావరి హక్కులను దక్కించుకున్నట్లు, ఈయన ఏకంగా 13.20 కోట్ల భారీ ధరకు ఈస్ట్ గోదావరి హక్కులను కైవసం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. కేవలం ఒక్క ఏరియాకి ఇంత పెట్టి కొనుగోలు చేయడంతో ఈ డిస్ట్రిబ్యూటర్ చాలా పెద్ద మొత్తంలో రిస్క్ చేస్తున్నాడని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది పెద్ది చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి, కచ్చితంగా విజయాన్ని సాధించే లక్షణాలు కనబడుతున్నాయి.

మంచి టాక్ వస్తే ఈ సినిమా ద్వారా ఈ నిర్మాతకు మంచి లాభాలు వస్తాయని అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధు తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story