- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది దుబాయ్ సెన్సార్‌కు పెద్ద అడ్డంకి.. అప్పటివరకు టీం ఎదురుచూపులే
దుబాయ్‌లో ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జూన్ 2వ తేదీన జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్ షోలను భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారతదేశంలో ‘పెద్ది’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే దుబాయ్‌లో మాత్రం ఈ ప్రక్రియకు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దుబాయ్‌లో హాలిడేస్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జూన్ 2వ తేదీన జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజు సెన్సార్ పూర్తి అయితే జూన్ 3వ తేదీ నుంచే ప్రీమియర్ షోలు పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే దుబాయ్‌లో సెన్సార్ ఆలస్యం అవుతుందేమో అన్న టెన్షన్ మాత్రం అభిమానుల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ సాయంత్రం లోపే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ‘పెద్ది’ చిత్రానికి దుబాయ్‌లో సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.






