Peddi: విడుదలపై క్లారిటీ.. బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పుడే

by Pulgam srinivas |

ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఓవర్సీస్‌లో 'పెద్ది' బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Peddi: విడుదలపై క్లారిటీ.. బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పుడే
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా, బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా విడుదల తేదీపై అనేక రూమర్లు వ్యాపిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని, జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారని ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. ప్రస్తుతం కూడా ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతుండడంతో ప్రేక్షకులు ఈ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని భావించారు.

అలాంటి సమయంలో రామ్ చరణ్ ‘రాకాస’ మూవీ యూనిట్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పెద్ది’ సినిమా విడుదలపై వస్తున్న రూమర్లపై స్పందించారు. మా సినిమా షూటింగ్ ఇవాళ్టితో టాకీ పార్ట్ పూర్తయిందని, ఒకే ఒక పాట మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఆ పాటను కూడా పూర్తి చేసి ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అయినా కూడా కొంతమందిలో ఈ సినిమా నిజంగానే ప్రకటించిన తేదీకే విడుదల అవుతుందా? లేదా అనే అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఓవర్సీస్‌లో ఈ చిత్ర బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ పక్కాగా ఏప్రిల్ 30న విడుదల కాబోయే అవకాశాలు ఉన్నట్లు అర్థమవుతోంది.

Next Story