- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బిజినెస్ జరుపుకున్న ‘పెద్ది’
'పెద్ది'కి తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 165 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పెద్ది చిత్రంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్న నేపథ్యంలో మూవీ టీమ్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అదే సమయంలో సినిమా విడుదలకు సంబంధించిన అన్ని పనులను కూడా పూర్తి చేసే దిశగా మూవీ బృందం ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నైజాం ఏరియా హక్కులు రూ. 63 కోట్లకు విక్రయించబడగా, ఆంధ్ర ప్రాంత హక్కులు రూ. 75 కోట్లకు, సీడెడ్ హక్కులు రూ. 27 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు సుమారు రూ. 165 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాపై మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే భారీ టార్గెట్‌తోనే పెద్ది చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.






