- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi: పెద్ద రికార్డు.. 300 మిలియన్ వ్యూస్
పెద్ది మూవీ నుండి విడుదల చేసిన చికిరి చికిరి, రై రై రా రా పాటలకు 300 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ నుండి ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మొదటగా చికిరి చికిరి అంటూ సాగే సాంగ్ను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఆ సాంగ్ వందల కొద్ది మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.
తాజాగా ఈ మూవీ నుండి 'రై రై రా రా' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ ను సాధించిన టాలీవుడ్ సాంగ్స్ లిస్టులో మొట్టమొదటి స్థానంలో నిలిచింది. అంతటి స్థాయి ఇంపాక్ట్ ను ఈ సాంగ్ 24 గంటల్లోనే చూపించింది. తాజాగా ఈ మూవీ బృందం ఇప్పటివరకు విడుదల చేసిన ఈ రెండు పాటలకి కలిపి 300 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఇందులో నుండి విడుదల అయిన రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా కనిపించనుండగా, బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ దాదాపు మూడు గంటలు లేదా అంతకు మించిన రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.






