- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Payal Rajput: పాన్ ఇండియా చిత్రంతో రాబోతున్న పాయల్ రాజ్‌పుత్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న టైటిల్ పోస్టర్
‘RX100’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).

దిశ, సినిమా: ‘RX100’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఆ తర్వాత ‘మంగళవారం’ మూవీతో ప్రేక్షకుల మనుసు దోచుకుని ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే పాయల్ ఈ సారి పాన్ ఇండియా (Pan India) సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి ‘వెంకటలచ్చిమి’ (Venkatalachimi) అనే టైటిల్ ఫిక్స్ చేశారు చిత్ర బృందం. డైరెక్టర్ ముని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ తాజాగా హైదరాబాద్ (Hyderabad) రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio)లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్బంగా డైరెక్టర్ ముని (Director Muni) మాట్లాడుతూ.. ‘‘వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం’ అని చెప్పుకొచ్చారు.
ఇక హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) మాట్లాడుతూ.. ‘‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపింది. కాగా.. ప్రజెంట్ ఈ సినిమా పోస్టర్ నెట్టింట వైరల్ అవతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తుంది.






