గ్లామర్ డోస్ పెంచిన పాయల్ రాజ్‌పుత్.. బ్లూ డ్రెస్‌లో అదిరిపోయే లుక్

by Pulgam srinivas |

బ్లూ డ్రెస్‌లో మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్.. వైరల్ అవుతున్న ఫోటోలు.

గ్లామర్ డోస్ పెంచిన పాయల్ రాజ్‌పుత్.. బ్లూ డ్రెస్‌లో అదిరిపోయే లుక్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో తన గ్లామర్, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, తొలి చిత్రంతోనే తన అందం, నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.



అనంతరం పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాలు మినహా ఆమెకు పెద్ద విజయాలు దక్కలేదు.




ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది.



అలాగే తరచూ తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.




అందులో బ్లూ కలర్ అల్ట్రా స్టైలిష్ డ్రెస్‌లో కనిపించిన పాయల్, స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా కనిపించడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story