శివాజీ వ్యాఖ్యలు..పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ వీడియో

by velandi.Saikiran |   (  Updated:2025-12-24 13:05:31  IST  )

శివాజీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ రియాక్ట్ అయ్యారు.

శివాజీ వ్యాఖ్యలు..పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ వీడియో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: శివాజీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ రియాక్ట్ అయ్యారు. మా డ్రెస్సుల పై మాట్లాడే హ‌క్కు శివాజీకి ఎవ‌రు ఇచ్చార‌ని నిల‌దీశారు పాయ‌ల్. మ‌హిళ‌ల‌ డ్రెస్సింగ్ ఎలా ఉండాలని చెప్పే రైట్ మీకు లేదన్నారు. బహిరంగ వేదికపై మహిళల గురించి శివాజీ మాట్లాడ‌టం దారుణ‌మ‌ని ఫైర్ అయ్యారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్య‌లు అస‌హ్యించుకునేలా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు.

ఇలాంటి సంఘ‌ట‌న మ‌ళ్లీ జ‌రుగ‌కుండా చూడాల‌ని కోరారు. ఇది ఇలా ఉండ‌గా, దండోరా ఈవెంట్ లో మ‌హిళ‌ల దుస్తుల‌పై హాట్ కామెంట్స్ చేశారు శివాజీ. పొట్టి బ‌ట్టలు వేసుకుని, తిర‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. హీరోయిన్లు చీర క‌ట్టులో క‌నిపిస్తే, అదే అందం అన్నారు. ఇక ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో శివాజీపై ఇండ‌స్ట్రీ మొత్తం విరుచుకుప‌డింది. దీంతో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు.

Next Story