Payal Rajput: చీర-చిరునవ్వులు.. నాకు ఇంకా ఏమి కావాలి: పాయల్‌ రాజ్‌పుత్‌

by Kodari Anjali |   (  Updated:2025-01-26 08:11:33  IST  )

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput).

Payal Rajput: చీర-చిరునవ్వులు.. నాకు ఇంకా ఏమి కావాలి: పాయల్‌ రాజ్‌పుత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ మూవీతో పాయల్ ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఈ హాట్ బ్యూటీకి మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. మధ్యలో పలు సినిమాలు ఫ్లాప్ టాక్ దక్కించుకున్నప్పటికీ.. తర్వాత మంగళవారం(Mangaḷavaram) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ వెంకటలచ్చిమి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ పాయల్ మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవచ్చు. ముని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని రాజా ఎన్ ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్‌లో కనిపించనుంది. ఈ హాట్ బ్యూటీ సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా పాయల్ సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలు ఫ్యాన్స్ తో పంచుకుంది. ‘‘చీర-చిరునవ్వులు.. నాకు ఇంకా ఏమి కావాలి’’ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. సింపుల్ శారీలో పాయల్ రాజ్ పుత్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story