Payal Rajput: మరో థ్రిల్లర్ మూవీతో రాబోతున్న పాయల్ రాజ్‌పుత్.. అఫీషియల్ లుక్ వైరల్

by Chukka Sudharani |

RX-100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Payal Rajput: మరో థ్రిల్లర్ మూవీతో రాబోతున్న పాయల్ రాజ్‌పుత్.. అఫీషియల్ లుక్ వైరల్
X

దిశ, సినిమా: RX-100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో పాయల్ నటనకు, గ్లామర్ షోకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్స్ (Offers) అమ్మడు చెంతకు చేరాయి. తర్వాత వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ.. ఇటీవల ‘మంగళవారం’, ‘రక్షణ’ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రజెంట్ తమిళం (Tamil) రెండు, తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉన్న పాయల్.. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించింది.

‘ప్రొడక్షన్ నెం.1’ (Production No.1) గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ముని (Muni) వహిస్తుండగా.. ఇందులో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు ఈ సినిమా జనవరి 24 గ్రాండ్ ఓపెనింగ్ కాబోతున్నట్టు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో పాయల్ లుక్ చూస్తుంటే.. ఇది పాయల్ కెరీర్‌లో మరో థ్రిల్లర్ మూవీ కాబోతున్నట్టు అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story