- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బేబీ బయటకు రాబోతుంది..’ టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ వైరల్
‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. ఫస్ట్ మూవీలోనే ఈ అమ్మడు ఆ రేంజ్‌లో అందాలు ఆరబోయడం, రెచ్చిపోయి నటించడంతో కుర్రకారు ఫిదా అయిపోయారు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘వెంకీ మామ’(Venky mama), ‘మంగళవారం’(Mangalavaram) సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’(Venkata Lachimi) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈక్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన కుక్క పిల్లతో ఆడుకుంటూ ఆ పప్పీకి ముద్దులు పెడుతున్న వీడియో షేర్ చేసింది. అయితే ఆ కుక్క పిల్ల షర్ట్ లోపలికి వెళ్ళి ఆడుకుంటుండంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్‌కు పాయల్.. ‘బేబీ బయటకు రాబోతుంది.. ఇట్స్ హియర్.. డాన్.. హహహ’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నెక్స్ట్ జన్మలో ఆ పప్పీలా పుడతామని, ఆ పప్పీ ఎంత లక్కీ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






