బ్యాట్స్‌మెన్‌గా చరణ్‌, బౌలర్‌గా ప్రభాస్.. చివర్లో అదిరిపోయిన పవర్ స్టార్ ఎంట్రీ!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-07 12:19:55  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పెద్ది మూవీ ఫస్ట్ షాట్(Peddi Glimps) నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేశారు.

బ్యాట్స్‌మెన్‌గా చరణ్‌, బౌలర్‌గా ప్రభాస్.. చివర్లో అదిరిపోయిన పవర్ స్టార్ ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పెద్ది మూవీ ఫస్ట్ షాట్(Peddi Glimps) నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రంలోని ఊర మాస్ లుక్ చరణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా గ్లింప్స్‌లోని చివరి షాట్ అందరినీ మెస్మరైజ్ చేసింది. చరణ్ రెండడుగులు ముందుకేసి.. అలా బ్యాట్ కింద కొట్టి.. ఒంట్లోని బలమంతా ఉపయోగించి సిక్స్ కొట్టేందుకు చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకున్నది. ఇక అప్పుడే ఈ షాట్‌పై సోషల్ మీడియాలో రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ లవర్స్(Cricket Lovers) అయితే రెండ్రోజులుగా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా.. మిగతా వీడియోలు ఎలా ఉన్నా.. ఓ అభిమాని ఎడిట్ చేసి పోస్టు చేసిన వీడియో మాత్రం అటు మెగా, ఇటు రెబల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రభాస్(Prabhas) బౌలింగ్‌లో రామ్ చరణ్(Charan) బ్యాటింగ్ చేస్తుంటే.. అంతా సిక్స్ పోయిందనుకునే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్యాచ్ పట్టే వీడియోను వైరల్ చేస్తున్నారు. దీనిని గమనించిన మూవీ లవర్స్.. చాలా నాచురల్‌గా ఉందంటూ వీడియో ఎడిట్ చేసిన అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వం వహిస్తున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌(Sukumar) రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. అంతేకాదు.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Shivraj Kumar), జగపతి బాబు, మీర్జాపూర్ సిరీస్‌‌తో ఫేమస్ అయిన మున్నాభాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమవుతున్న ఈ సినిమాను వచ్చే శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. గ్లింప్స్‌లో ఏఆర్ రెహమాన్‌ మ్యూజిక్‌పై సినీ ప్రియలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story