- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ustad Bhagat Singh: నార్త్ అమెరికాలో పవన్ ఊచకోత
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ విడుదల చేయనుంది. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన ఐదు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడైనట్లు ప్రత్యంగిరా సినిమాస్ వారు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం రూపొందింది. దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు. మార్చి 19వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మూవీని నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ పెద్ద ఎత్తున విడుదల చేస్తుంది.
తాజాగా ఈ సంస్థ వారు ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు వేల ప్లస్ టికెట్లు నార్త్ అమెరికాలో సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. మార్చి 19వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలను నార్త్ అమెరికాలో మార్చి 18వ తేదీనే ప్రదర్శించనున్నారు. పవన్, హరీష్ కాంబోలో చాలా ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గబ్బర్ సింగ్ లాంటి సక్సెస్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో, ఈ మూవీపై పవన్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లను మొదలుపెట్టగా, ఎక్కువ శాతం హరీష్ శంకర్ మాత్రమే అందులో పాల్గొంటూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా ఇప్పటివరకు ఎక్కువ శాతం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదు. మరికొన్ని రోజుల్లోనే ఓ భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయడానికి ఈ మూవీ బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో జనాలను ఆదరిస్తుందో చూడాలి.






