- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ చేతిలో ఆస్కార్ అవార్డు.. కీరవాణి సంతోషం మాములుగా లేదు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి మూడోపాట ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీరవాణిని పవన్ కల్యాణ్ కలిసి అభినందించారు.

దిశ, వెబ్ డెస్క్: Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి మూడోపాట ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కీరవాణిని పవన్ కల్యాణ్ కలిసి అభినందించారు.
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇద్దరు కలిసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రొడ్యూసర్స్ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్టూడియో కు వెళ్లి పలకరించారు.
ఈ సందర్భంగా ఇద్దరు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుస్తక ప్రియుడని తెలిసిన ఎం ఎం కీరవాణి తన స్వహస్తాలతో రాసిన ఓ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు సంగీతం గురించి చర్చించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సంగీతం పట్ల ఉన్న మక్కువను కీరవాణి ముందు చాటుకున్నారు. మెగా కుటుంబానికి కీరవాణి కి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందించారు. అయితే పవన్ కళ్యాణ్ కీరవాణి కాంబినేషన్లో ఇప్పటివరకు ఎలాంటి చిత్రాలు రూపొందించలేదు తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్లో హరిహర వీరమల్లు పార్ట్ వన్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు వీటికి చక్కటి స్పందన లభిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కీరవాణితో ముచ్చటిస్తున్న సందర్భంలో ఆస్కార్ అవార్డు గురించి ప్రత్యేకంగా అడిగారు.
ఆయన స్టూడియోలో ఆస్కార్ ఎందుకు కనబడటం లేదని ఆరా తీశారు. అయితే తనకు ఆస్కార్ చూసినప్పుడల్లా గర్వం పెరుగుతుందని అందుకే దాన్ని లోపల దాచి పెట్టానని కీరవాణి పేర్కొన్నారు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డును బయటకు తెప్పించి పవన్ కళ్యాణ్ చేతుల్లో పెట్టారు. తనకు ఆస్కార్ మళ్లీ హరిహర వీరమల్లు ద్వారా రావాలని ఈ సందర్భంగా కీరవాణి పవన్ కళ్యాణ్ తో అన్నారు. ఆసాంతం నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మీ , Oscar ఎక్కడ ఉంది సార్...
— Gulte (@GulteOfficial) May 20, 2025
మీరు చేసిన పాటను ఇప్పటికీ 50 సార్లు విన్నాను....
ఎవరికైనా పౌరుషం తగ్గితే, ఈ పాట వింటే పౌరుషం వస్తుంది....#PawanKalyan felicitated #MMKeeravani
And Watch his candid conversation with Keeravani.#HariHaraVeeraMallu pic.twitter.com/M1zG0WmQQ5






