- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) - హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సింగ్(Ustad Bhagat Singh).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) - హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సింగ్(Ustad Bhagat Singh). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేసిన హరీశ్ శంకర్.. మిగిలిన భాగాన్ని ఇతర ఆర్టిస్టులతో కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న హరీశ్ శంకర్.. వచ్చే డిసెంబర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అద్భుతమైన సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. వెయిటింగ్ సార్ అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీకన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. వీడియో






