CM రేవంత్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు.. ఎందుకంటే?

by Gantepaka Srikanth |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.

CM రేవంత్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇవాళ హరిహర వీరమల్లు చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఈ నెల 24న విడుదల కానుంది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్‌ను రూ.600 వరకు విక్రయించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది. అంతేకాక, సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలోనూ, మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర రూ. 150కు పెంచగా.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 200 పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

Next Story