డిప్యూటీ CM కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా?: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

ఓజీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డిప్యూటీ CM కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా?: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓజీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. సుజిత్(Sujeeth) నన్ను ఎంత ప్రేమించాడో.. నన్ను ఎలా చూడాలనుకున్నాడో.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే తీశాడు. నేను కూడా ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ చేశాను. ఒక డిప్యూటీ సీఎం అనే సంగతి కూడా మర్చిపోయాను. దర్శకుడు సుజిత్ చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ. ఈ సినిమాకు ఎక్కువ క్రెడిట్‌ అతడికే దక్కుతుంది. సుజీత్‌ విజన్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్‌. ఈ ఇద్దరూ ఒక ట్రిప్‌లో మూవీ చేశారు. అందులోని నన్నూ లాగారు. ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా?. కానీ సినిమా కోసం ఏదైనా చేస్తా. నా అభిమానుల కోసం ఏదైనా చేస్తా’ అని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, పవన్ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్‌(Priyanka Mohan) హీరోయిన్. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటించారు. ఈనెల 25న థియేటర్లలోకి రానుంది. వీడియో

Next Story