Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల.. మాస్ లుక్‌లో ఆ ఇద్దరు భామలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-31 06:55:39  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu), ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల.. మాస్ లుక్‌లో ఆ ఇద్దరు భామలు
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu), ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ 50 శాతం పూర్తి కాగా.. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల గ్యాప్ వచ్చింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా తన సినిమాలు పూర్తి చేసే పని పడ్డారు. అయితే ‘హరిహర వీరమల్లు’ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)దర్శకత్వంలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తోంది. దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం నిహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులంతా ‘హరి హర వీరమల్లు’మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఇందులో బ్యాండ్ వాయిస్తుండగా..పవన్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు. కర్రపట్టుకుని వస్తుండగా.. అనసూయ, పూజితా పొన్నాడ చిచ్చర పిడుగంటి వాడు అంటూ నగలు ధరించి మాస్ లుక్‌‌తో కనిపించారు. అయితే ఈ పాట ఊరమాస్ సాంగ్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24న సాయంత్రం 3 గంటలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Next Story