పవన్ కల్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముందే..!

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

పవన్ కల్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేపు ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు ముందు.. గ్రాండ్ ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ప్రీరిలీజ్ ఫంక్షన్‌తో పాటు ప్రెస్‌మీట్‌కు కూడా పవన్ కల్యాణ్ హాజరావుతారని పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక సినిమాపై పవన్ కల్యాణ్ ఇంత కేర్ తీసుకోవడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

కాగా, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చారిత్రక యాక్షన్ డ్రామా చిత్రం(HHVM Movie) జులై 24న దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించగా, సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించనున్నాడు. ఇక చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఒకేరోజు రెండు ప్రోగ్రామ్స్‌లో పవన్‌ పాల్గొనేలా మేకర్స్ భారీగా ప్లాన్ చేశారు.

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రానికి జ్యోతికృష్ణ, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దయాకర్ రావు మరియు ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్‌ కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న‌ ‘హరి హర వీర మల్లు’ చిత్రం సాంఘిక సందేశంతో పాటు చారిత్రక నేపథ్యాన్ని మిళితం చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. చిత్రబృందం ప్రకటన

Next Story