- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ ‘OG’ వాయిదా అంటూ వార్తలు.. స్పందించిన మూవీ టీమ్
పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ సినిమాల్లో ఓజీ(OG Movie) ఒకటి. దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ సినిమాల్లో ఓజీ(OG Movie) ఒకటి. దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోర్షన్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన భాగాన్ని ఫినిష్ చేస్తు్న్నారు. అయితే.. తాజాగా ఓజీ సినిమా సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు విస్తృతం అయ్యాయి. దీంతో చిత్రబృందం స్పందించింది. ‘రూమర్స్ నమ్మకండి.. తప్పకుండా సినిమా వచ్చే సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అవుతుంది’ అని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. కాగా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు.






