- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిహర వీరమల్లు షూటింగ్‌కు పవన్ కల్యాణ్.. కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా!
ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) షూటింగ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) షూటింగ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో ఆయన పార్ట్‌కు సంబంధించిన సీన్లను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఆయన పోర్షన్ పూర్తయిన తర్వాత అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే జూన్‌లోనే సినిమా విడుదల అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. తాజాగా పవన్ కల్యాణ్ షూటింగ్ నిమ్మితం మూవీ బృందంలో కలిశారని ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కుర్చీలో కాలు మీద కాలేసుకొని రాయల్‌గా కూర్చుకున్న పవన్ కల్యాణ్ స్టైల్ ఆకట్టుకుంటోందంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ హీరో అభిమానులైనా వాళ్ల హీరో సినిమాలు విడుదలైతే సంబురపడిపోతుంటారు.. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన షూటింగ్‌కు వస్తే తెగ హ్యాపీగా ఫీలవుతున్నారంటూ సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని కొంత భాగం క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) పూర్తి చేయగా, మిగిలిన మొత్తాన్ని ‘రూల్స్ రంజన్’ ఫేమ్ జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కంప్లీట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం మరియు నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.






