- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మదర్స్ డే స్పెషల్‌గా తన పిల్లలతో ఉన్న ఫొటోస్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయైన ప్రణీత(Praneetha) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయైన ప్రణీత(Praneetha) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయినా హీరోయిన్‌గా అనుకున్నంత గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది.
మెయిన్ హీరోయిన్ సమంత(Samantha) కంటే ప్రణీతకే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా ఆమె తెలుగులో ‘బావ’(Bava), ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi), ‘పాండవులు పాండవులు తుమ్మెద’(Pandavulu Pandavulu tummeda), ‘రభస’(Rabhasa), ‘డైనమైట్’(Dynamite), ‘హలో గురు ప్రేమ కోసమే’(Hello Guru Prema Kosame) తదితర సినిమాల్లో నటించింది.
ఇదిలా ఉంటే.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో తెలివిగా ఆలోచించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. గతంలో ఆమెకు ఓ పాప పుట్టగా.. ఇటీవలే బాబు జన్మించాడు. ఇక వారి ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ వైరల్ అవుతోంది. నేడు మదర్స్ డే స్పెషల్‌గా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో తన పిల్లలతో, తన తల్లితో, అత్తతో దిగిన కొన్ని క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇక వాటిని షేర్ చేస్తూ మదర్స్ డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






