బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించి షాకిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా! (పోస్ట్)

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘దేవదాసు’(Devadasu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించి షాకిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా! (పోస్ట్)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘దేవదాసు’(Devadasu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మహేష్ బాబు, ప్రభాస్(Prabhas), రవితేజ, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే ఇలియానా హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పిక్స్‌లో ఉండగానే ఆమె సినిమాలకు దూరం అయింది. మైఖెల్ డోలన్ అనే వ్యక్తితో కొద్ది కాలం పాటు డేటింగ్ చేసి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

సడెన్‌గా ఇలియానా తన బేబీబంప్‌తో దర్శనమివ్వడంతో అంతా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని షాక్ అయ్యారు. అయినప్పటికీ తన భర్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. ఈ క్రమంలోనే ఇలియాన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినప్పటికీ భర్త ఫేస్ రివీల్ చేయకుండా కొద్ది రోజులు దాగుడుమూతలు ఆడింది. తన ముఖాన్ని చూపించకుండా డేట్‌కి, వెకేషన్స్ వెళ్లిన బ్యాక్ ఫొటోలు షేర్ చేసింది. ఇక అంతా అతని ముఖాన్ని చూపించాలని అడగడంతో ఫొటోలు షేర్ చేసింది. ఇక ఆ తర్వాత అయినా ఇలియానా సినిమాల్లోకి రీ ఎంట్రీ అంతా భావించారు.

కానీ తన ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇక గత కొద్ది రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇలియానా బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను రెండోసారి తల్లికాబోతున్నట్లు తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో వెల్లడించింది. గులాబి పూల బొకేతో పాటు కురుకురే, టమ్స్ పాకెట్స్ షేర్ చేసింది. దీంతో ఆమె రెండోసారి తల్లికాబోతున్నట్లు తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ సర్‌ప్రైజ్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలియానా ఇక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమే షాకిచ్చిందని అంటున్నారు.

Next Story