- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు ఒకటి. దీనిని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించగా, ఏఎమ్ రత్నం(AM Ratnam) నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీనే విడుదల చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల నిలిచిపోయింది. కానీ ఇంకా కొత్త తేదీ మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడుదల వాయిదాకు కారణమైన VFX వర్క్స్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అంతేగాకుండా.. ఈ సినిమాలో ప్రీ ఇంటర్నెల్ సీన్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం VFX వర్క్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కావడంతో విడుదలకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఇక ట్రైలర్ అండ్ రిలీజ్ అప్డేట్ ఇవ్వడమే మిగిలి ఉంది. ఈ వార్త తెలిసిన అభిమానులు త్వరగా అప్డేట్ ఇవ్వండి బ్రో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ కీలక పాత్ర పోషించారు.
💥💥🦅🦅HARI HARA VEERA MALLU🦅🦅💥💥
— CHITRAMBHALARE (@chitrambhalareI) June 13, 2025
💥💥PAWAN KALYAN 💥💥 pic.twitter.com/3TWOMhZtsp






