HHVM: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. జులై 3న ట్రైలర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-28 14:53:35  IST  )

ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది.

HHVM: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. జులై 3న ట్రైలర్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది. శనివారం ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. జులై 3వ తేదీన ఉదయం 11:10 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరిహర వీరమల్లు పార్ట్‌-1ను జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌(Nidhi Agarwal). బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు.

Next Story