పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ అప్డేట్

by Gantepaka Srikanth |

ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది.

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆదివారం ఎక్స్ వేదికగా ఫ్యాన్స్‌తో మేకర్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సండే స్పెషల్‌గా ట్రైలర్ ఇస్తే బాగుందని అడిగారు. దీనికి స్పందించిన చిత్రబృందం నెక్ట్స్ సండే తప్పకుండా ట్రైలర్(HHVM Trailer) అప్డేట్ ఇస్తాం. ఈసారి మిమ్మల్ని నిరాశకు గురిచేయబోం అని హామీ ఇచ్చారు. సినిమా కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. ట్రైలర్‌ కోసం ఇంకో ఏడు రోజులు ఆగలేమా? తప్పకుండా వెయిట్ చేస్తామని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇటీవలే హరిహర వీరమల్లు పార్ట్‌ 1 కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను జులై 24న రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం శనివారం ఉదయం ప్రకటించింది. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రావాల్సి ఉండగా మరోసారి పోస్ట్‌పోన్‌ అయింది. దీంతో ఆందోళన చెందుతున్న అభిమానులకు శనివారం క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వస్తోన్న ఈ చిత్రాన్ని క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. పవన్‌ ఇందులో చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌(Nidhi Agarwal). బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్వీట్

Next Story