- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HHVM: ‘వీరమల్లు’ విధ్వంసం.. అదిరిపోయిన ట్రైలర్.. కామెంట్లతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్
పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చేసింది. హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ట్రైలర్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చేసింది. హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ట్రైలర్ విడుదలైంది. అనుకున్న సమయానికి సరిగ్గా 11:10 నిమిషాలకు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ట్రైలర్‌లోని విజువల్స్, పవన్ కల్యాణ్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఔరంగజేబుకు వీరమల్లు ఇచ్చిన వార్నింగ్ సినిమాపై నెక్ట్స్ లెవెల్ హైప్ పెంచాయి. ట్రైలర్ వీక్షించిన అభిమానులంతా సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నామంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం(AM Ratnam) నిర్మించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. వచ్చే జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.






