- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రన్ టైమ్ లాక్
పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 48 మిలియన్ల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ రన్‌టైమ్ 2.40 గంటలు ఉన్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి.
ఈ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్‌ను జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో కొన్ని ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా అక్కడ ఓ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ దీని రన్‌టైమ్ 2.40 గంటలుగా పేర్కొంది. దీంతో ఈ రన్‌టైమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో వీరమల్లు అనే పోరాటయోధుడి పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది.






