Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' విడుదల వాయిదా.. అయోమయంలో అభిమానులు! (పోస్ట్)

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల వాయిదా.. అయోమయంలో అభిమానులు! (పోస్ట్)
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంతకు ముందే పలు భారీ ప్రాజెక్ట్స్ మొదలెట్టారు. కానీ రాజకీయాల వల్ల వాటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఓజీ, హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూడు చిత్రాలు షూటింగ్ కొంత పూర్తి చేసుకోగా.. మధ్యలో వాటికి చెక్ పడినట్లు అయింది. దీంతో పవన్ ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే.. సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొంటున్నారు. అయితే క్రిష్, జ్యోతి కృష్ణ(Jyothi Krishna), పవన్ కల్యాణ్ కాంబోలో రాబోతున్న ‘హరిహరి వీరమల్లు’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం. ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్(Bobby Deol), అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి ఇటీవల విడుదలైన ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఈ సినిమా మార్చి 29న విడుదల కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి రాబోతుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా విడుదల వాయిదా వేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల దీనిని ఏప్రిల్ 17 లేదా మే 9న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పవన్ అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు విడుదల అవుతుందా లేదా అని అయోమయంలో పడిపోయారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.

Next Story