అభిమానులారా ఊపిరి పీల్చుకోండి.. పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి BIG అప్డేట్

by Gantepaka Srikanth |

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.

అభిమానులారా ఊపిరి పీల్చుకోండి.. పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి BIG అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. జూన్ 12న విడుదల కావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటం.. వారం రోజులకు పైగా గడుస్తున్నా మళ్లీ కొత్త తేదీ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ అంతా కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్లారు. ట్రైలర్ అప్డేట్, లేదా? రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వండంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్స్ చేశారు. దీంతో ఎట్టకేలకు చిత్రబృందం స్పందించింది. రేపు ఉదయం 7:23 గంటలకు అధికారికంగా రిలీజ్ ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం(AM Ratnam) నిర్మించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ కీలక పాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. అయితే.. జులై 24వ తేదీ ఖరారైందని.. దీనిని రేపు అధికారికంగా ప్రకటిస్తారని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ట్వీట్

Next Story