పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ పూర్తి.. మొత్తం ఎన్ని గంటలంటే?

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం సెన్సార్ పూర్తయింది.

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ పూర్తి.. మొత్తం ఎన్ని గంటలంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ లభించింది. మొత్తం 2 గంటలా 42 నిమిషాల 30 సెకన్ల రన్‌టైమ్‌తో ‘హరిహర వీరమల్లు’ రాబోతోంది. జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. పవన్ కల్యాణ్ పోరాట యోధుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా, సునీల్, నాజర్, బాబి డియోల్ కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ ట్వీట్

ఇదిలా ఉంటే.. సినిమా విడుదలకు నాలుగు రోజుల‌ ముందు అంటే జూలై 20న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకను విశాఖపట్నం సముద్రతీరాంలో నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. రాజమౌళి అన్నగా గౌరవించే ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం, అలాగే పవన్- త్రివిక్రమ్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, ఈ ఇద్దరినీ ఈ వేడుకకు ఆహ్వానించడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కెరియర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story