‘ఇండస్ట్రీలో అజిత్‌ది సపరేట్ స్టైల్’.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ట్వీట్

by Gantepaka Srikanth |

ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్(Ajith) పద్మభూషణ్ పురస్కారం(Padma Bhushan Award) స్వీకరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు.

‘ఇండస్ట్రీలో అజిత్‌ది సపరేట్ స్టైల్’.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్(Ajith) పద్మభూషణ్ పురస్కారం(Padma Bhushan Award) స్వీకరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘కుటుంబం, ప్రేమ కథా చిత్రాలతో మెప్పిస్తూనే వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించారు. స్టయిల్ పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఫార్ములా-2 రేసర్‌గా ఆ రంగంలోనూ రాణిస్తున్నారు. నటుడిగా, రేసర్‌గా అజిత్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాగా, ఇటీవలే దుబాయ్‌ వేదికగా జరుగుతున్న 24 హెచ్‌ కారు రేసింగ్‌లో ఇండియా తరపున తమిళ్ స్టార్‌ హీరో అజిత్‌ టీం పాల్గొంది. 'అజిత్ కుమార్‌ రేసింగ్' పేరుతో టోర్నీలో టీం దిగింది. అయితే.. రేస్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు అజిత్‌కు యాక్సిడెంట్‌ అయింది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా అజిత్ టీమ్ పాల్గొని మూడో స్థానంలో నిలిచి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను అజిత్ జట్టు ఎగురవేసింది.

Next Story