మ్యాజికల్ డే అంటూ పవన్ కళ్యాణ్ బ్యూటీ పోస్ట్.. ఏం అందం రా బాబు చూస్తూ ఉండిపోవచ్చంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

మ్యాజికల్ డే  అంటూ పవన్ కళ్యాణ్ బ్యూటీ పోస్ట్.. ఏం అందం రా బాబు చూస్తూ ఉండిపోవచ్చంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది.

క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna)లు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం జూలై 24 అంటే రేపే గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో బిజీబిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్న నిధి పాప సోషల్ మీడియా(Social Media)లోనూ రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నిధి తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చింది. హెయిర్ లీవ్ చేసుకుని, పాపిడి బిళ్ళ, గాజులు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. ఇక వీటికి.. ‘మ్యాజికల్ డే.. నేను చెప్పగలిగేది ఒక్కటే ధన్యవాదాలు.. ప్రేమతో మీ పాప’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఏం అందం రా బాబు చూస్తూ ఉండిపోవచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story