- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు నామకరణ కార్యక్రమానికి ఏకంగా సీఎంనే ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్
టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్(Praneetha Subhash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అలాగే ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే హీరోయిన్‌గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’(Attarintiki daredi) సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు.
ఇక కెరీర్ పీక్‌లో ఉండగానే.. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. అంతేకాకుండా ఇదివరకే ఒక పాప ఉండగా.. రీసెంట్‌గా ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
అందులో కర్ణాటక సీఎం సిద్ధారామయ్య(sidda Ramaiah)ను కలిసి అతని కొడుకు నామకరణం వేడుకకు రావాలని ఆహ్వానించింది. ఇక అతనిని ఇన్వైట్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా కొడుకు నామకరణ కార్యక్రమానికి కర్ణాటక గౌరవనీయ ముఖ్యమంత్రి @siddaramaiah_official గారిని కలవడం, ఆహ్వానించడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






