OG: క‌త్తితో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..సెక్యూరిటీకి త‌ప్పిన ప్ర‌మాదం ?

by velandi.Saikiran |

ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌త్తి తిప్పే క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన సెక్యూరిటీ అది గ‌మ‌నించ‌లేదు. చూడ‌కుండా ప‌వ‌న్ వెనుకాలే న‌డిచాడు.

OG: క‌త్తితో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..సెక్యూరిటీకి త‌ప్పిన ప్ర‌మాదం ?
X

దిశ, వెబ్ డెస్క్ : జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా న‌టించిన మూవీ ఓజీ. సెప్టెంబ‌ర్ 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండ‌గా... నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అదిరిపోయే గెట‌ప్ లో మెరిసారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ముఖ్యంగా ఓజీ సినిమా త‌ర‌హాలో కత్తితో ప్రీ రిలీజ్ కు హ‌జ‌ర‌య్యారు ప‌వ‌న్‌.

దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే.. స్టేజ్ పైకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... క‌త్తిని అటు, ఇటు తిప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ త‌రుణంలోనే.. పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌త్తి తిప్పే క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన సెక్యూరిటీ అది గ‌మ‌నించ‌లేదు. చూడ‌కుండా ప‌వ‌న్ వెనుకాలే న‌డిచాడు.

దీంతో 2 ఇంచుల దూరంలోనే క‌త్తి... సెక్యూరిటీ త‌ల ముందు నుంచి వెళ్లింది. లేక‌పోతే ఆ క‌త్తి క‌నుక సెక్యూరిటీ త‌ల‌కు త‌గిలి ఉంటే.. పెను విషాద‌మే జ‌రిగింది. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. ఈ వీడియోపై వైసీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నారు. కత్తితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రావ‌డం ఏంట‌ని..? ఇదేమైనా సినిమానా ? అంటూ ఆగ్ర‌హిస్తున్నారు. ప‌వ‌న్ కు ఓవ‌రాక్ష‌న్ ఎక్కువ అంటూ ఫైర్ అవుతున్నారు. క్లిక్

Next Story