- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan - Ajith: తమిళ నటుడు అజిత్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
తమిళ అగ్రకథానాయకుడు అజిత్ కుమార్(Ajith Kumar)కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్రకథానాయకుడు అజిత్ కుమార్(Ajith Kumar)కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘దుబాయ్ 24H రేసులో GT4 విభాగంలో "స్పిరిట్ ఆఫ్ ది రేస్" అవార్డును 991 విభాగంలో థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు అజిత్ కుమార్ మరియు ఆయన టీమ్‌కు అభినందనలు చెప్పారు. గొప్ప సంకల్పంతో సవాళ్లను అధిగమించి, ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగురవేయడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీకు మరియు మీ బృందానికి మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు దుబాయ్ కారు రేసింగ్‌లో సత్తా చాటిన అజిత్(Ajith)కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్, సమంత సోషల్ మీడియాలో అజిత్‌ను ఉద్దేశించి పోస్ట్‌లు పెట్టారు. మరోవైపు రేసులో గెలిచిన ఆనందాన్ని అజిత్ తన కుటుంబసభ్యులతో పంచుకున్నారు. తన భార్య షాలినికి థాంక్స్ చెప్పారు. ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు.






