- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ అల్ట్రా స్టైలీష్ అవతార్.. ‘ఉస్తాద్’ నుంచి క్రేజీ అప్‌డేట్
పవన్ కల్యాణ్ అల్ట్రా స్టైలీష్ అవతార్.. ‘ఉస్తాద్’ నుంచి క్రేజీ అప్‌డేట్

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh Movie). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీకన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. పాట ప్రోమోని డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ ప్రోమోతో పాటు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పవన్ కల్యాణ్ బ్లాక్ కలర్ స్టైలిష్ అవుట్ ఫిట్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. ఈ చిత్ర ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. కొన్ని పోర్షన్లు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.






