- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG2 అప్‌డేట్.. ఊహాగానాలపై పవన్ కల్యాణ్ టీమ్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన వ్యక్తిగత బృందం ఫుల్ స్టాప్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన వ్యక్తిగత బృందం ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం ఆయన తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారని, కొత్తగా ఎటువంటి సినిమా ప్రాజెక్టులకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలకు అంగీకరించలేదని ఆయన బృందం తెలిపింది. నెట్టింట ప్రచారంలో ఉన్న 'కొత్త ప్రాజెక్టులు' కేవలం ఊహాగానాలే తప్ప, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి కొత్త సినిమాలను ప్రారంభించే ఆలోచనలు లేవు. ఏవైనా మార్పులు లేదా కొత్త అప్‌డేట్స్ ఉంటే, అవి కేవలం అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తామని వెల్లడించారు.
OG2 అప్‌డేట్..
మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'OG 2' సీక్వెల్ గురించి స్పందిస్తూ.. దీనికి సంబంధించిన వివరాలను సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడిస్తారని టీమ్ పేర్కొంది. అప్పటి వరకు అధికారికం కాని వార్తలను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో సందడి చేస్తుండగా, తదుపరి సినిమాలపై వస్తున్న రూమర్స్‌కు ఈ ప్రకటనతో తెరపడింది.






