HHVM: యూట్యూబ్‌లో అదరగొడుతున్న పవన్ కల్యాణ్ సాంగ్ (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-31 08:38:37  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) నుంచి ఇవాళ తొలి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

HHVM: యూట్యూబ్‌లో అదరగొడుతున్న పవన్ కల్యాణ్ సాంగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) నుంచి ఇవాళ తొలి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. వీరమల్లు చెబితే వినాలి అనే పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో అదరగొడుతోంది. విడుదల చేసిన ఆరు గంటల్లోనే ఏకంగా 12 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇక గ‌తంలో నాలుగైదు చిత్రాల్లో పాట‌లు పాడిన ప‌వ‌న్.. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో పాట పాడ‌డంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్(Nidhi Agrawal) న‌టిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీర‌వాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు.

జ్యోతి కృష్ణ(Jyothy Krishna) ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటిచారు. దీంతో పాటు మరో రెండు సినిమాల్లోనూ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. సుజిత్‌తో కలిసి ఓజీ, హరీష్ శంకర్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. 80 శాతం వరకు ఓజీ షూటింగ్ పూర్తి కాగా.. 10 శాతం వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. వీరమల్లు విడుదలయ్యాక.. వరుసగా ఆ రెండు సినిమాల షూటింగ్స్‌కు పవన్ డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story